రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ సినిమా రీమేక్ లో చరణ్ చేస్తాడా? లేదంటే పవన్ చేస్తాడా? అనే విషయంపై చర్చలు బాగానే నడిచాయి. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ రీమేక్ లో ర‌వితేజ న‌టిస్తే బావుంటుంద‌ని చర‌ణ్ భావిస్తున్నాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే ర‌వితేజ‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా రూపొందుతుంద‌ని.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న కూడా వ‌స్తుంద‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి.