క‌రోనా క‌ష్ట‌కాలంలో బాల‌య్య ఔదార్యం..ఈసారేం చేశారంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త అధికంగా ఉండ‌టం వ‌ల్ల క‌రోనా రోగులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ క‌ష్ట‌కాలంలో క‌రోనా రోగుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వచ్చి.. త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ న‌టుడు, టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ త‌ర‌చూ ఏదో ఒక సాయం చేస్తే ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. గతేడాది ఇండస్ట్రీలో 24 విభాగాల్లో పనిచేసే వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసిన బాల‌య్య‌.. సెకెండ్ వేవ్‌లో తన నియోజకవర్గ ప్రజలకు బాలయ్య కరోనా కేర్ కిట్లను పంపించారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే కరోనా మందుల కిట్లు హిందూపురం పంపారు. ఇక ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య ఔదార్యం చాటుకున్నారు. తాజాగా హిందూపురంలో తన గెస్ట్ హౌస్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేశారు. అక్కడ కరోనా పేషెంట్స్ కోసం ఫుడ్, మెడిసన్ సహా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు.