దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేక.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగారు. సంతోష్ శోభన్ తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. నా కెరీర్లో వర్షం అనే మర్చిపోలేని హిట్ ఇచ్చారు శోభన్.
ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ శోభన్ చేసిన ఏక్ మినీ కథ అమెజాన్ ద్వారా రిలీజవుతోంది. ఈ సందర్భంగా తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ అధినేతలకు, చిత్రబృందం మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. మరియు ఏక్ మినీ కథ ట్రైలర్‌ను కూడా పోస్ట్‌కు జత చేశారు.