న్యాచురల్ స్టార్ నాని, టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన తొలి చిత్రం దేవదాస్. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆకాంక్ష సింగ్ కూడా నటించారు. ఈ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది.
అలాగే నాని, రష్మిక జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌ను పూర్తి చేసిన నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే.. సుందరానికీ చిత్రాలను చేస్తున్నారు.
వీటి తర్వాత నాని మరో రెండు సినిమాలను కమిటయినట్టు తెలుస్తోంది. అయితే వాటిలోని ఒక దాంట్లో నానికి జోడీగా రష్మికను ఎంపిక చేశారు. సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.