లెజెండరీ స్పిన్నర్ కి గుండె పోటు…!?

శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ గుండె పోటుతో చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ముత్తయ్య మురళీధరన్‌కి అంగీయోప్లాస్టీ కూడా చేసినట్టు వినికిడి. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చిన ముత్తయ్య మురళీధరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు.

ప్రస్తుతం చెన్నైలో ఆయన మ్యాచులు ఆడుతున్న సన్‌రైజర్స్‌కి బౌలింగ్ సలహాదారుగా ఉన్న ముత్తయ్య మురళీధరన్ గత కొద్దీ రోజుల క్రితం ఆరెంజ్ ఆర్మీతోనే తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాటలలో కలిపి 1300లకు పైగా వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్, టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 49 ఏళ్ల ముత్తయ్య మురళీధరన్ కి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్స్ అంటున్నారు. అతి త్వరలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముత్తయ్య మురళీధరన్ కలుస్తారని ఆరెంజ్ ఆర్మీ ఆశిస్తున్నారు .