ఫేషియల్ కోసం వెళ్ళిన బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!?

హీరోయిన్స్ తమ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఫేషియల్స్‌ అని, సర్జరీలు అని తమ అందాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారు తమ ముఖం మీద ఒక్క చిన్న గీత పడినా అల్లాడిపోతారు. తాజాగా ఫేషియల్ కోసం వెళ్ళిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖాన్ని మరింత అందంగా చేస్తానని చెప్పిన డాక్టర్, తనకి ఉన్న సహజత్వా న్ని కాస్తా పాడు చేసి అందవికారంగా మార్చింది.

కోలీవుడ్ నటి రైజా విల్ సన్ మాములు ఫేషియల కోసం ఓ క్లినిక్‏కు వెళ్ళింది. అక్కడ ఉన్న లేడీ డాక్టర్ ఆమె ముఖాన్ని అందంగా మారుస్తానంటూ ఎదో చర్మ చికిత్స చేసింది. దీంతో అది కాస్త వికటించి ఆ నటి కంటి కింద వాచిపోయింది. ఇంకా అది కాస్తా ఉబ్బిపోయి పూర్తిగా అందవిహీనంగా తయారయింది. ఈ విషయాన్ని రైజా స్వయంగా వెల్లడించింది. తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి నటి షాక్‌కు గురైంది. రైజా2017లో వెలయ్యిలా పట్టధారి 2 మూవీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొంది.