క‌రోనా ఎఫెక్ట్‌..అంత్యక్రియలకు 200 ఎకరాలు ఇచ్చిన ప్ర‌భుత్వం!

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఎంద‌రివో ప్రాణాలు బ‌లి కాగా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్స్‌లో ఈ వైర‌స్‌ను జ‌యించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం సెకెండ్ వైవ్‌లో క‌రోనా ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతోంది

మ‌న దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా భారీ న‌మోదు అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి చోటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు సజావుగా సాగేందుకు కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలను సిద్ధం చేసింది. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు మొద‌ట అక్క‌డ స్థానిక ప్ర‌జ‌లు అంగీక‌రించ‌లేదు. దీంతో అధికారులు చ‌ర్చ‌లు జ‌రిపి వారిని ఒప్పించారు. ఈ క్ర‌మంలోనే రెండు నెలల పాటు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు జరుపుతామని స్థానికులకు హామీ ఇచ్చారు.