మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది.

వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ స్వ‌యంగా ప్ర‌క‌టించింది. కాగా, గతంలో రామ్ నటించిన జగడం, రెడీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, శివమ్, హలో గురూ ప్రేమకోసమే సినిమాలకు దేవీనే సంగీతం అందించారు. ఇక ఇప్పుడు మ‌రోసారి రాక్ స్టార్‌తో ఎన‌ర్జిటిక్ స్టార్ మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు.