మారిన `సర్కారు వారి పాట` టార్గెట్‌..ఖుషీలో మ‌హేష్ ఫ్యాన్స్‌?

April 16, 2021 at 9:38 am

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేస్‌కు జోడీగా మొద‌టి సారి కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

థమన్ స్వ‌రాలు అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. `సర్కారు వారి పాట` టార్గెట్ మారిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది కాకుండా.. ఈ ఏడాదే సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ఈ ప్లానింగ్‌తోనే సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. అందుకే కరోనా పరిస్థితులు ఉన్నా కూడా కేర్ తీసుకుని బ్రేక్ లేకుండా షూటింగ్‌కు వస్తున్నాడు మహేష్ బాబు. సెప్టెంబర్‌లోపే షూటింగ్‌తో పాటు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని.. ద‌స‌రా స‌మ‌యంలో సినిమాను రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మారిన `సర్కారు వారి పాట` టార్గెట్‌..ఖుషీలో మ‌హేష్ ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts