బ్రేకింగ్ : దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు..?

మాజీ మంత్రి తెదేపా సీనియర్‌ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.

ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని తన పై అభియోగం. ఈమేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద దేవినేని ఉమా పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో వారు తెలిపారు.