అల్లు అర్జున్ కి కోపం .. అల‌క అందుకేనా..!

ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అవ్వడంతో ఒక స్టార్ హీరోకి కోపమొచ్చింది. ఆ వార్ వారి వ్యక్తిగతం కాకపోయినా అలకలు కామనే కదా ! ఒక స్టార్ హీరోకి ఒక టాప్ ప్రొడ్యూసర్ కి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వారికి ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎవరా టాప్ ప్రొడ్యూసర్ అనే విషయాలు తెలుసుకుంటే అసలు ఈ వివాదం ఏంటో దాని వెనుక ఉన్న సంగతి ఏంటో తెలిసిపోతుంది. 

అల్లు అర్జున్ ఎక్కువగా ఇతర సినిమాలతో పోటీ పడటానికి ఎక్కువగా ఇష్టపడడని అంటుంటారు. అంతే కాకుండా తన సినిమాలు రిలీజ్ సమీపంలో పెద్ద సినిమాలు లేకుండా ఉండాలని అనుకుంటాడు.  అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైన కొన్ని రోజులకే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే సమ్మర్ లో అనగా ఏప్రిల్ 27న సినిమాను చేస్తామని అందరికి తెలిసేలా చెప్పారు.ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య బన్నీతో కలిసి మూఢు సినిమాలను చేశారు. 

ప్రస్తుతం ఆయన మహేష్ – భరత్ అనే నేను సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఆ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు. దీంతో బన్నీ చాలా అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది. బన్నీ ఎక్కువగా ఇతర సినిమాలతో పోటీ పడటానికి ఎక్కువగా ఇష్టపడడని అంటుంటారు. అంతే కాకుండా తన సినిమాలు రిలీజ్ సమీపంలో పెద్ద సినిమాలు లేకుండా ఉండాలని అనుకుంటాడు. కానీ తనకు ఇష్టమైన నిర్మాత ఇప్పుడు బన్నీ సినిమా రిలీజ్ డేట్ అప్పుడే అయన నిర్మించిన భారీ సినిమాను రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అవ్వడంతో కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేశాడట.అయినా ఈ అలకలు అన్నీ ఈ సినిమా ఫీల్డులో కామనే కదా.. !