యంగ్ ఎనర్జిటిక్ రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్పామ్ చేసింది. సినిమాపై ముందునుంచి ఉన్న అంచనాల నేపథ్యంలో తొలి రోజు ఏపీ+తెలంగాణలో 3.63 కోట్ల షేర్ రాబట్టి, రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేను శైలజ 3.45 కోట్ల షేర్ రాబట్టింది.
ఇప్పుడు జిందగీ ఆ సినిమా రికార్డులను క్రాస్ చేసి రూ 3.63 కోట్లతో రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఫస్ట్ డే ఫిగర్‌కు చేరుకుంది. ఇక యూఎస్‌లో 90 లొకేషన్లలో 110 కె గ్రాస్ డాలర్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో ఏరియా వైజ్‌గా రాబట్టిన షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
ఏపీ+తెలంగాణ ఫస్ట్ డే షేర్ : (రూ.కోట్లలో)
నైజాం – 1.41
సీడెడ్ – 0.50
ఉత్తరాంధ్ర – 0.42
గుంటూరు – 0.40
ఈస్ట్ – 0.30
వెస్ట్ – 0.23
నెల్లూరు – 0.11
—————————————–
ఏపీ+తెలంగాణ షేర్ = 3.63 కోట్లు
—————————————–