బాహుబ‌లిలో బిగ్ మిస్టేక్ చెప్పిన రాజ‌మౌళి

తెలుగు సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో…తెలుగు సినిమా ద‌మ్ము ఎంతో  ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో జక్కన్న అలియాస్ రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది సినీ అభిమానుల‌కు ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నాడు.

బాహుబ‌లి సినిమాను మించేలా బాహుబ‌లి 2ను క‌సితో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తాను బాహుబ‌లి పార్ట్ 1లో ఓ బిగ్ మిస్టేక్ చేశానంటూ ఓ బాంబు పేల్చాడు. ఆ మిస్టేక్‌ను స్వ‌యంగా చెప్పిన రాజ‌మౌళి దానిని రెండో పార్ట్‌లో పున‌రావృతం కానివ్వ‌న‌ని చెపుతున్నాడు.

ఇంత‌కు రాజ‌మౌళి చేసిన మిస్టేక్ ఏంటో తెలిస్తే మ‌నం షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. బాహుబ‌లి -1లో రాజ‌మౌళి ఓ చోట కనబడతాడు. ఓ సాంగ్‌కు ముందుగా వ‌చ్చే చిన్న సీన్‌లో జక్కన్న చేసిన ఆ క్యామియో రోల్‌ ఆ సినిమాలో బాగా పేలింది. అయితే రెండో భాగంలో కూడా మీరు ఏదైనా రోల్‌లో క‌న‌ప‌డ‌తారా అని మీడియా మిత్రులు ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తే అందుకు జ‌క్క‌న్న షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చాడు.

బాహుబ‌లి -1లో తాను క్యామియో రోల్‌లో కనిపించడం పెద్ద మిస్టేక్‌. ఒక్కసారి మిస్టేక్‌ చేసేశాక మరోసారి దాన్ని రిపీట్‌ చేయకూడదు. అందుకే రెండో భాగంలో నేను కనిపించనని చెప్పాడు. ఇక త‌న డ్రీమ్ ప్రాజెక్టు అయిన మ‌హాభార‌తం సినిమా తీయాలంటే త‌న‌కు మ‌రో 10 సంవ‌త్స‌రాల అనుభ‌వం కావాల‌న్న జ‌క్క‌న్న ….తన‌కు డైరెక్టుగా బాలీవుడ్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసే ఆలోచ‌న లేద‌ని చెప్పాడు.