మోడీ ర్యాంకింగ్స్:కేసీర్ No1 మరి బాబు?

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాకిచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు రాష్ట్రాల పనితీరుపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులిస్తారు. వివిధ వర్గాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంలకు ర్యాంకులిస్తారు.

ఈసారి మోడీ కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. దేశంలో ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఫస్ట్ ర్యాంకులో ఉన్నట్లు తెలిసింది. ఇక తెలంగాణకు పోటీగా, టెక్నాలజీ అంటూ ముందుకెళ్లే ఏపీ సీఎం చంద్రబాబుకు టాప్-10లో కూడా చోటు దక్కలేదు. ఆయన 13వ స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంల కంటే కేసీఆర్ ముందుండటం ఇక్కడ మరో విశేషం.

ర్యాంకుల్లో మధ్య ప్రదేశ్ కు సెకండ్ పొజిషన్ దక్కింది. ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మోడీ అంటే చాలు కోపంతో ఊగిపోయే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. రాజస్థాన్ సీఎం వసుధర రాజే 7వ స్థానం రాగా, జార్థండ్ సీఎం రఘుబర్ దాస్ కు 14వ ప్లేస్ దక్కింది.

ఈ ర్యాంకులను త్వరలోనే ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.