మీసం మెలేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా నెగిటివ్‌ టాక్‌ ఇచ్చింది. కానీ నెక్స్ట్‌ సినిమాకి అనౌన్స్‌మెంట్‌ జరిగింది. ఇంకేముంది పవన్‌ కొత్త సినిమా ముహూర్తానికి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఇక సెట్స్‌ మీదికెళ్లడమే లేటు అనుకుంటున్న తరుణంలో రకరకాల కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఎస్‌.జె సూర్య డైరెక్షన్‌లో రావాల్సిన ఈ సినిమా కోసం డైరెక్టర్ల మీద డైరెక్టర్లను మారుస్తూ పవన్‌ అభిమానుల్ని సందిగ్థంలో పడేశాడు.

చివరికి త్రివిక్రమ్‌ చేతికి చిక్కింది ఈ ప్రాజెక్టు. ఈ సినిమాకి ‘కోబలి’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. కోబలి సినిమాలో పవర్‌ఫుల్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా పవన్‌ కనిపించనున్నాడని సమాచారమ్‌. దాని కోసం పవన్‌కళ్యాణ్‌ మీసం మెలేయనున్నాడట. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఇదే గెటప్‌లో దర్శనమిస్తున్నాడు. తాజాగా లండన్‌లో ఓ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో మీసకట్టుతో పాల్గొన్నారు పవన్‌కళ్యాణ్‌. ఈ గెటప్‌ కూడా దానికోసమేనేమో అని భావిస్తున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు.

ఇది ‘కబాలి’ కాదురా ‘కోబలి’ అంటాడేమో పవన్‌కళ్యాణ్‌. అయితే మరో పక్క డాలీ డైరెక్షన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టోరీ నేపథ్యంలో రాబోతుందనుకున్న సినిమా కూడా వెనక్కి వెళ్లిందని సమాచారమ్‌. సో ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే సినిమా చేయబోతున్నాడన్న మాట. అది కూడా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీనే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ రికార్డు హిట్‌ సాధించింది. మరి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దాం.