తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?

చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు అన్ని నంబర్లు ఆయనవే.

అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షనేత అనుముల రేవంత్‌రెడ్డికి ప్రాణహాని ఉందని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొనడం చర్చనీయాంశం అయింది.ఉన్నట్టుండి నాయుడు గారికి ఈ రెడ్డి గారి మీద ఎందుకంత ప్రేమ పుట్టుకోంచిందా అని!ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నాయుడు గారు లేఖ కూడా రాశారు.

రేవంత్ రెడ్డి మొత్తం రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే..ఓటుకు నోటు ముందు..దాని తరువాత రేవంత్ రెడ్డి అని మాట్లాడుకోవాలి..ఓటుకి నోటు వ్యవహారం లో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఆ ఉందంతానికి ముందు తెరాస పార్టీ కి పెద్ద సవాల్ గా మారాడు..అయితే ఓటుకి నోటు తరువాత రేవంత్ విమర్శలు ..తెరాస పై ఎదురుదాడి..అంత నామమాత్రమనే చెప్పాలి..రేవంతా కూడా వివాదం తరువాత అంత దూకుడుగా వెళ్లలేకపోతున్నాడన్నది వాస్తవం.

అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే కేసులో మనవాళ్ళు బ్రిఫ్డ్ మీ అంటూ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే.అయితే బాబు బయటపడటం కోసం రేవంత్ ని బలిచేసాడు అనే వాదన కూడా అప్పట్లో వినిపించింది.అయితే తాజాగా మళ్ళీ బాబుగారి కన్ను తెలంగాణ రాజకీయాలపైన పడింది..అందుకే రేవంత్ కి ప్రాణహాని అంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి ని పావుగా వాడుకుందుకు సిద్ధమైనట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే కులాల కుంపటి కి ఏపీ లో ఆజ్యం పోసి చలి కాచుకుంటున్న చంద్రబాబు అదే కుల కుంపటి(రెడ్డి,వెలమ) చిచ్చు పెట్టి తెలంగాణలోనూ పార్టీ కి జవసత్వాలు తీసుకొచ్చే పనిలో వున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అంతా బానే వున్నా..కేసీర్ ముందు చంద్రబాబు ఆటలు ఏ మాత్రం సాగుతాయి అనేదే అసలు ప్రశ్న…కేసీర్ ఎదురుదాడి ఎంత భయంకరంగా ఉంటుందో బాబుకి తెలుసు..ఏది ఏమైనా తెలంగాణాలో టీడీపీ ఎదుగుదలే ప్రస్నార్ధకం.అదీ కాకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడిప్పుడే ఆరా కొరా సయోధ్య కుదురుతోంది..ఇలాంటి టైం లో చంద్రబాబు రేవంత్ అస్త్రంగా మళ్ళీ తెలంగాణ పై పట్టు సాదించాలనుకోవడం ఏపీ ప్రయోజనాలకు అంత మంచిది కాదనే వాదన వినిపిస్తోంది.రేవంత్ రెడ్డి కి ప్రాణహాని ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారం లో తలదూర్చి కేంద్రానికి లేఖ రాయనవసరం లేదు.తెలంగా టీడీపీ నుండి ఎవరో ఒకరు లేదా రేవంత్ స్వయంగా లేఖ రాస్తే సరిపోయేది.అయినా బాబు గారి రాజకీయమే వేరు.