స్టేజ్‌ డాన్స్‌లంటే ఇష్టమంటోన్న రకుల్‌

నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా తెరపై తన హవా చూపిస్తోంది ముద్దుగుమ్మ రకుల్‌. తొలి సినిమా నుండి లౌక్యం’ సినిమా నుండీ తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటోంది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే అపజయాల్ని కూడా అందుకుంది. కానీ ఆ వెంటనే తేరుకుంది. వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌ని జోరు జోరుగా ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. కానీ రకుల్‌కి మాత్రం తాను నెంబర్‌వన్‌ హీరోయిన్‌ని అనే గర్వం ఎక్కడా కనిపించదు. అన్నింట్లో తానే అన్నట్లుగా ముందుంటుంది. ఇదివరకటి రోజుల్లో తెరపై అంతగా అవకాశాలు లేని ముద్దుగుమ్మలే స్టేజి షోల్లో డాన్సులు చెయ్యడానికి ఆశక్తి చూపేవారు. కానీ ఆ ట్రెండ్‌ని ముద్దుగుమ్మ రకుల్‌ మార్చేసింది.

అవకాశాలు లేని వాళ్లే కాదు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కూడా స్టేజ్‌ షోలు చెయ్యొచ్చు అని నిరూపించింది. ఆడియో ఫంక్షన్స్‌లోనూ, అవార్డు ఫంక్షన్స్‌లోనూ ఈ ముద్దుగుమ్మ డాన్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ విషయంలో సీనియర్‌ హీరోయిన్లు అయిన కాజల్‌, అనుష్కలను రకుల్‌ గెలిచేసింది. అందుకే ఇండస్ట్రీలో స్టేటస్‌లో చిన్నా, పెద్దా తేడా లేకుండా రకుల్‌ అంటే అందరికీ అభిమానం. తక్కువ టైంలో పెద్ద హీరోయిన్‌ అయ్యే అవకాశాలు కూడా అందుకే రకుల్‌ని వరించి ఉండొచ్చు కూడా. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ కలిసి మెలిసి చలాకీగా నడుచుకునే మనస్తత్వం రకుల్‌కే సొంతం. దటీజ్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.