టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది.  అయితే, […]

రోజాకు బొండా ఉమా బోడి గుండు స‌వాల్‌… రోజా దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి ప‌రాకాష్ట‌గా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా త‌న‌నుతాను చిత్రీక‌రించుకున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగ‌ర్ రోజాకి మ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు పొలిటిక‌ల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివ‌రి ప్ర‌చార‌దినం సోమ‌వారం నాడు.. ఈ నేత‌లు మ‌రింత‌గా రెచ్చిపోయారు. నంద్యాల‌లో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని బొండా ఉద్ఘాటించారు. ఇంత వ‌ర‌కు బాగానే […]

వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు

రాజ‌కీయాలు ఒక‌ప్పుడు నేత‌ల‌ను బ‌ట్టి మారుతుండేవి. కానీ, ప్ర‌స్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే విప‌క్షం వైసీపీ విశాఖ‌ప‌ట్నంలో ఎదుర్కొంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం త‌గాదాలు మిన్నుముట్టాయ‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిని చేర‌దీయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఉంటుంద‌ని భావించిన వైసీపీ.. నేత‌లు విశాఖ‌లో ఈ వ‌ర్గాన్ని చేర‌దీశార‌ట‌.  […]

జ‌ట్టుక‌ట్ట‌నున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?

ఏపీ రాజ‌కీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతున్నాయా? నిన్న‌టి వ‌ర‌కు తిట్టిపోసిన వాళ్ల‌నే అక్కున చేర్చుకుని ఆద‌రించేందుకు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన మిత్రుల‌కు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు ఆర్ణ‌బ్ గోస్వామి!! రెండు పార్టీల‌కు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యాలే ఇక‌పై ఏపీని శాసించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒక‌టి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]

నంద్యాల‌లో వైసీపీకి హైప్ వెన‌క కుట్ర జ‌రుగుతోందా..!

అవును! అంద‌రూ ఇప్పుడు ఈ విష‌యంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల మాదే.. నంద్యాల సీటు మాకే! అంటూ ఊరూ వాడా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు వైసీపీ నేత‌లు. అంతేకాదు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లైతే.. నంద్యాల‌లో గెలుపు ఎవ‌రిదో తెలిసిపోయిందంటూ.. న‌ర్మ‌గ‌ర్భంగా త‌మ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి గెలిచేశాడ‌ని ఆమె ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతోంది. అదేవిధంగా మిగిలిన నేత‌లు కూడా వైసీపీదే గెలుప‌ని, టీడీపీ కేవ‌లం నామ్‌కేవాస్తే.. పోటీ మాత్ర‌మేన‌ని, నిజంగా వార్ వ‌న్ సైడ్ […]

ప‌వ‌న్ గురించి రోజా కొత్త భాష్యం! 

నంద్యాల ఉప ఎన్నిక‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు మాట‌ల‌తో గేమ్ ఆడేస్తున్నారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జ‌బ‌ర్డ‌స్త్ రోజా.. మ‌రింత‌గా రెచ్చిపోయింది. నంద్యాల‌లో గెలుపు వైసీపీదేన‌ని చెప్పింది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిపోయింద‌ని, అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి.. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేద‌ని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ ప‌వ‌న్ ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చినా.. వైసీపీ […]

న‌ంద్యాల క్లైమాక్స్‌లో టీడీపీకి చెంప దెబ్బ‌

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం క్లైమాక్స్‌లో టీడీపీకి అదిరిపోయే చెంప‌దెబ్బ త‌గిలింది. ఇక్క‌డ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డానికి కొద్ది రోజుల ముందే చంద్ర‌బాబు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అధికారుల‌ను అంద‌రిని ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసి త‌న‌కు అనుకూలంగా ఉండేవాళ్ల‌ను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అంద‌రిని బ‌దిలీ చేసేసి కొత్త‌వాళ్ల‌ను అక్క‌డ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేష‌న్ వ‌స్తే తాను చెప్పిన‌ట్టు చేయాల‌ని, అధికార టీడీపీకి అనుకూలంగా […]

రోజాపై వేణు మాధ‌వ్ చేసిన కామెంట్లు చూస్తే షాకే (వీడియో)

నంద్యాల ప్ర‌చారం ర‌చ్చ ర‌చ్చ‌గా మారుతోంది. అటు అధికార టీడీపీ వాళ్లు, ఇటు విప‌క్ష వైసీపీ వాళ్లు ప‌ర‌స్ప‌రం తిట్ల విష‌యంలో పోటీప‌డి మ‌రీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. జ‌గ‌న్‌, రోజా, బాల‌య్య‌, చంద్ర‌బాబు, వేణు మాధ‌వ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్క‌డ అభ్య‌ర్థులు కాకుండా స్టేట్ వైడ్ సెల‌బ్రిటీలు చాలా మందే మ‌కాం వేసి త‌మ పార్టీ అభ్య‌ర్థుల కోసం ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. రోజా ఎక్క‌డైనా ఎంట్రీ ఇస్తే ఆ ప్రచారం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి […]

కేంద్ర నిఘా సంస్థ‌ల నివేదిక‌లో నంద్యాల‌లో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే

నంద్యాల.. నంద్యాల‌.. నంద్యాల‌..! క‌ర్నూలు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటే త‌మ‌దేన‌ని, త‌మ‌దే భారీ మెజారిటీ అంటే .. కాదు త‌మ‌దేన‌ని ఒక‌రికొక‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజ‌యంపై గ‌ట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవ‌రికి వారు […]