మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే పోటీలో ఉన్న నటి హేమ.. ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్యక్షుడు నరేశ్ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డబ్బంతా ఏమైందని […]
Tag: telugu movies
ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్?!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ తేజ్ కొణిదెల ఒకరు. కానీ, మెగా అభిమానులు ఇప్పటి వరకు పవన్‌ను పట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో పవన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు పవన్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్ తన రెండో సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడట. […]
`పాగల్` ట్రైలర్..విశ్వక్ ఏడిపించేలాగే ఉన్నాడుగా!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగల్`. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పాగల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. `నా పేరు […]
బ్లాస్ట్ అయిన `సర్కారువారి పాట బ్లాస్టర్`..ఇదీ లెక్కంటే!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా సర్కారువారి పాట బ్లాస్టర్ పేరుతో టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే అందరూ […]
నాని మనసు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని మనసు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. […]
డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభవంపై చిన్మయి కామెంట్స్ వైరల్!
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా ఆడవారిపై జరుగుతున్న లైంగింక వేధింపులకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చిన్మయితో […]
స్పేస్‌లో దూసుకెళ్లిన మహేష్..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న 46వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నంతా మహేష్ సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు. నెట్టింట ఎక్కడ చూసినా ఆయనే దర్శనమిచ్చారు. ఇక స్పేస్‌లోనూ దూసుకెళ్లాడు మహేష్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య ట్విట్టర్ తీసుకొచ్చిన కొత్త ఫీచరే స్పేస్. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంతమందైనా జాయిన్ అయి చర్చ పెట్టుకోవచ్చు. అయితే నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా..టాలీవుడ్ సినీ ప్రముఖులు […]
టాలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరో కూతురు!?
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి చిత్రాల్లో.. ఆయన కూతురుగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అనికా సురేంద్రన్. అయితే ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సినిమా `కప్పెల`ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. చంద్రశేఖర్ టీ రమేష్ ఈ రీమేక్‌తో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై […]
ప్రభాస్ కోసం బరిలోకి దిగిన జగ్గూభాయ్..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిపిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]









