`పాగ‌ల్‌` ట్రైల‌ర్‌..విశ్వక్ ఏడిపించేలాగే ఉన్నాడుగా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే పాగ‌ల్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. `నా పేరు ప్రేమ్.. నేను 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను` అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్‌గా క‌నిపించే విశ్వ‌క్‌కు.. లవ్ అంటే అస్సలు నచ్చని.. చాలా అంటే చాలా ఎక్కువ నచ్చని అందమైన అమ్మాయి నివేదా పేతురాజ్ ప‌రిచ‌యం అవుతుంది.

వందల మందికి ప్రపోజ్ చేసిన విశ్వ‌క్‌.. చివరకు నివేదా ప్రేమ కోసం పరితపిస్తు పాగల్ గా మారిపోతాడు. మ‌రి అత‌డి ప్రేమ స‌క్సెస్ అవుతుందా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే ఆగ‌స్టు 14 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇక విశ్వ‌క్ కామెడీ సీన్స్‌లోనే కాకుండా.. ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ అద‌ర‌గొట్టేశారు. ట్రైల‌ర్ బ‌ట్టీ చూస్తుంటే.. ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా ఏడిపించేలాగే క‌నిపిస్తున్నాడు.