రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని […]

ఎమ్మెల్యేగా రాజుగారు..వైసీపీపై రివెంజ్..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపే తరుపున నర్సాపురం ఎంపీగా గెలిచిన ఆయన..ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు చేశారు. వైసీపీ తప్పులని నిత్యం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇక తమని టార్గెట్ చేసిన్ రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే రఘురామ ఢిల్లీలో ఉంటూ..ప్రాతిరోజూ మీడియా సమావేశం పెట్టి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా వైసీపీ […]

వేటు పడకముందే వెళ్లే అవకాశం..

ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]

ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!

సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల […]