ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..100కి పైగా మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

`బింబిసార`గా వ‌స్తున్న కళ్యాణ్ రామ్..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్టే చూడ‌ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. చివ‌రిగా ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న త‌న 18వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంతో వశిష్ట్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి..వైర‌ల్‌గా మారిన‌ చిరు ట్వీట్!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు జ‌యంతి నేడు. ఈయ‌న ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకతలు, కాకమ్మ కథలు, కాలక్షేపం కథలు ఇలా అన్నీ చేసిన ఎన్టీఆర్‌.. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని, తిరుగులేని నెంబర్ వన్ హీరోగా అభిమానుల గుండెల్లో సుస్థిర‌ స్థానం సంపాదించుకున్నారు. వెండితెర‌పైనే కాకుండా.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసి చరిత్రలో మిగిలిన యుగపురుషుడీయ‌న‌. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను మెగాస్టార్ […]

ఆనంద‌య్య మందుపై బాల‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ అల్లక‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు మ‌ళ్లీ ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందుపై అందరి చూపు ప‌డింది. ఆనంద‌య్య మందు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని […]

రాజ‌మౌళి తండ్రికి ఆ డైరెక్ట‌ర్ అంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబలి, బజరంగీ భైజాన్, మణికర్ణిక ఇలా ఎన్నో అద్భుత‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఈయ‌న అత్యత్తమ రచయితగా పేరు సాధించారు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. తాజాగా […]

దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అలాగే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,86,364 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరుకుంది. […]

ఎన్టీఆర్ జ‌యంతి..మ‌రోసారి త‌న గాత్రంతో బాల‌య్య విశ్వ‌రూపం!

తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని గాయకున్ని బయట పెట్టే బాలయ్య.. తండ్రి జ‌యంత సంద‌ర్భంగా మ‌రోసారి త‌న గాత్రానికి ప‌ని చెప్పారు. బాల‌య్య స్వ‌యంగా పవిత్ర శ్లోకమైన శ్రీరామదండంకం ని ఆలపించారు. […]