ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. గత కొద్ది రోజుల ముందే కత్తి మహేష్ కి ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. తాజాగా సీనియర్ నటుడు కార్తీక్ కు కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ సీనియర్ నటుడు అయిన కార్తీక్ రోజూ లాగే వ్యాయామం చేస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన కింద పడిపోయాడు. […]
Tag: Latest news
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెరపై బోల్తా పడిన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]
అదిరిపోయిన `కేజీఎఫ్-2` న్యూ పోస్టర్!
రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ కొనసాగింపుగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్ అధీరాగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజయ్ దత్ బర్త్‌డే. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్రకు సంబంధించి న్యూ […]
ప్రభాస్ మూవీ బిగ్ అప్డేట్ ..ఫ్యాన్స్ ఖుషి !
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్ ప్రేమకథగా పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా ట్విట్టర్ వేదికగా […]
పవన్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా పవన్‌పై మరియు ఆయనతో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
టోక్యో ఒలింపిక్స్: పతక వేటలో పీవీ సింధు దూకుడు..!
భారత స్టార్ షెట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు పతక వేటలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. నేటి మ్యాట్ మొత్తం నలబై నిమిషాల కొనసాగగా.. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. ఇక నేటి […]
భారత్‌లో మళ్లీ ఊపందుకున్న కరోనా..భారీగా రోజువారీ కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే రెండు రోజుల నుంచి మాత్రం దేశంలో కరోనా కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 43,509 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
అరరే..బన్నీ, రష్మికలను కూడా వదలని డెంగ్యూ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే సుకుమార్‌తో సహా మొత్తం సెట్‌లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, […]
శంకర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చరణ్?!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]









