శంక‌ర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చ‌ర‌ణ్‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం కోసం త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ లుక్ టెస్ట్‌కు వెళ్ల‌బోతున్నాడ‌ట‌.

శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకోసం ఇప్ప‌టి నుంచే రకరకాల లుక్స్, కాస్ట్యూమ్ ట్రయల్స్ వేయ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, ఈ ట్ర‌య‌ల్స్ కోసం భారీగా ఖ‌ర్చు పెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. కాగా, శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆయ‌న‌.. ప్ర‌తి విష‌యంలోనూ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.