యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]
Tag: Latest news
భారత్‌లో కరోనా వీర విజృంభణ..లక్షన్నరకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 1,52,879 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరుకుంది. అలాగే నిన్న 839 మంది […]
చిరు `లూసిఫర్` రీమేక్‌కు క్రేజీ టైటిల్..?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం.. మే14న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చిరు `లూసిఫర్` రీమేక్ చేయనున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించబోతున్నారు. ఇటీవలె ఈ సినిమా ప్రారంభం కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. […]
తెలంగాణలో కలవరపెడుతున్న కరోనా..3వేలకు పైగా కొత్త కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏకంగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
పవన్ ‘వకీల్ సాబ్’ మహేష్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుము ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల కాగా.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన […]
విశ్వమిత్రుడి గెటప్‌లో ప్రభాస్..నెట్టింట్లో రేర్ ఫొటో వైరల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధే శ్యామ్` పూర్తి చేసిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇవి పూర్తి అయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్‌కు […]
తమన్నా ధరించిన ఆ డ్రస్సు ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ కూడా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ సరసన `సీటీమార్`, వెంకీ-వరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న `ఎఫ్3`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో తమన్నా నటిస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `లెవెంత్ అవర్` అనే వెబ్ సిరీస్‌లో […]
మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్న `చావు కబురు చల్లగా`!
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]
థియేటర్‌లో మెరిసిన నివేధా థామస్..కరోనా భయంలో ఆడియన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్ల సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల తర్వాత […]