కొత్త కారు కొన్న దుల్కర్‌ సల్మాన్..ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!

August 4, 2021 at 6:06 pm

మమ్ముట్టి కుమారుడు, ప్ర‌ముఖ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ హీరోనే అయిన‌ప్ప‌టికీ.. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు తెచ్చికున్నాడీయ‌న‌. ఇక మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న దుల్క‌ర్.. తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు.Dulquer Salmaan Buys Luxury Car Worth Rs 2.45 Crore, See Pic

మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కారును ఆలివ్ గ్రీన్ షేడ్‌తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో కూడిన క్యాబిన్‌తో డిజైన్‌ చేశారు. ఇక చూడ‌టానికి చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉండే ఈ కారు ధ‌ర అక్ష‌రాల రూ. 2.45 కోట్లు.

 Dulquer Salmaan : రెండున్నర కోట్లు పెట్టి కొత్త కారు కొన్న దుల్కర్‌ సల్మాన్.. Photo : Twitter

కాగా, దుల్క‌ర్ స‌ల్మాన్ ఎప్పటికప్పుడు మార్కెట్లోని లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఇప్ప‌టికే ఈయ‌న ద‌గ్గ‌ర పోర్షే పనామెరా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ7 స్పోర్ట్ బ్యాక్, మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు123, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్ వంటి కార్ల‌తో పాటు ఖ‌రీదైన బైకులు కూడా ఉన్నాయి.

కొత్త కారు కొన్న దుల్కర్‌ సల్మాన్..ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts