వ‌ర్మ‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మంచు మ‌నోజ్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వ‌ర్మకు మంచు వారి అబ్బాయి మంచు మ‌నోజ్ స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు ప‌ది రోజులు కావొస్తున్నా.. ఇంకా ర‌చ్చ మాత్రం కొన‌సాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారం కూడా చేశారు. […]

`ప్రేమతీరం`గా మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ల‌వ్‌స్టోరీ`..!!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మ‌రియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన చిత్రంగా ల‌వ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ […]

ఆ హీరోతో న‌టించ‌డ‌మే నా క‌లంటున్న పూజా హెగ్డే.. నెర‌వేరేనా?

పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, అల వైకుంఠ‌పుర‌ములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుంద‌రి తాజాగా […]

బిగ్‌బాస్ 5: ర‌వి అలాంటి వాడే..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన అలీ రెజా..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. ఇంకా 13 మంది హౌస్‌లో కొన‌సాగుతున్నారు. అయితే వీరిలో ఒక‌డైన యాంక‌ర్‌ ర‌విపై ఈ మ‌ధ్య నెగ‌టివిటీ బాగా పెరిగిపోయింది. ప్రియ-లహరి ఎపిసోడ్‌ తర్వాత ర‌విని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. అలాగే శ్వేతా ఎలిమినేట్ అవుతూ.. అస‌లు ర‌విని న‌మ్మొద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మ‌రోవైపు […]

ప్ర‌కాష్ రాజ్ కూతుళ్ల గురించి ఈ సీక్రెట్‌ మీకు తెలుసా?

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ భాష‌ల్లోనూ వందాల‌ది సినిమాలు చేశారాయ‌న‌. ఇక ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌కాష్ రాజ్ మొద‌ట‌ డిస్కో శాంతి కి సోదరి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ దంప‌తుల‌కు ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కుమారుడు సంతానం క‌ల‌గ‌గా.. కుమారుడు ప్ర‌మాదంలో […]

ప్రముఖ హాస్య‌న‌టుడు మృతి..శోక‌సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌..!!

గ‌త కొంత కాలం నుంచీ సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంట‌న్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుండటం తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. తాజాగా ప్ర‌ముఖ క‌న్నడ హాస్యనటుడు శంకర్‌ రావు సోమవారం ఉదయం బెంగళూరుతో మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 88 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలం నుంచీ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న‌..స్వ‌గృహంలోనే తుది శ్వాస విడిచారు. పాప పాండు సీరియల్‌ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం […]

భార‌త్‌లో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 13,058 మందికి కొత్తగా […]

హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న అషు రెడ్డి..పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

అషు రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. బిగ్ బాస్ త‌ర్వాత అషు వ‌రుస టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించే అవ‌కాశాల‌ను కూడా అందుకుంటోంది. మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి తరచుగా తన గ్లామరస్ పిక్స్‌ను […]

అర‌రే..అల్లు అర్జున్ ఏంటీ ఇలా బుక్కైయ్యాడు..? నెటిజ‌న్ల ట్రోలింగ్‌!

ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`తో బిజీ బిజీగా గ‌డుపుతున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. నెటిజ‌న్ల చేతిలో ఊహించ‌ని విధంగా బుక్కైయ్యాడు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..శ్రీ చైతన్య విద్యా సంస్థ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్య సంస్థ అయిన‌ శ్రీచైతన్య విద్యా సంస్థ తమ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ను నియమించింది. ఇందుకు సంబంధించిన యాడ్ ను దసరా సందర్భంగా […]