ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

మూడు పార్టీల్లోను సెగ‌లు రేపుతోన్న ఆ సీటు

ఏపీలో ఓ ఎంపీ సీటుకు జ‌రుగుతోన్న రాజ‌కీయం ఇప్పుడు య‌మా హాటుగా మారింది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ, కొత్త‌గా పోటీ చేస్తోన్న జ‌న‌సేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీల‌క‌మైన అభ్య‌ర్థులు రంగంలో ఉంటార‌న్న ప్ర‌చారం ఇప్పుడు అక్క‌డ పొలిటిక‌ల్ వాతావార‌ణాన్ని ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు బ‌దులుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున చంద్ర‌బాబు కోడ‌లు […]

జ‌న‌సేన‌కి వారే పెద్ద ఆస్తి అవుతారా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అదేసమ‌యంలో తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నెత్తురు మండే క‌త్తుల్లాంటి యువ‌త‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించి.. ఇప్ప‌టికే జిల్లాల వైజ్‌గా యువ‌త‌ను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హిస్తున్నాడు. వాస్త‌వానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే ప‌వ‌న్ ఫాలో అవుతున్నాడ‌ని స‌మాచారం. యువ‌కుల‌కు […]

`తూర్పు`లో జ‌న‌సేన‌లోకి భారీ జంపింగ్‌లు

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌దు గానీ.. నేత‌లు మాత్రం ఆ పార్టీలో చేరాల‌ని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జ‌న‌సేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సామాజిక‌వర్గం బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇప్పుడు నేత‌లంతా ప‌వ‌న్ స‌ర‌స‌న చేరేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ […]

క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దెబ్బేశాడుగా! 

త‌న‌కు క‌మ్యూనిస్టులంటే గౌర‌వం ఉంద‌ని, వాళ్ల భావ‌జాలం.. త‌న భావ‌జాలంలో సారూప్య‌త ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకైనా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వ‌స్తున్నాడు. దీంతో క‌మ్యూనిస్టులు కూడా ప‌వ‌న్ త‌మ‌తో దోస్తీక‌డ‌తాడ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. అయితే వారికి ప‌వ‌న్‌.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని, ఇందుకు ప‌వ‌న్ కూడా తోడ‌యితే త‌మ‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని భావించిన క‌మ్యూనిస్టుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. […]

పవన్ పోటీకి దిగితే బాబు పొలిటికల్ అస్త్రం రెడీనా..!

2019 ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తార‌నే విష‌యంపై సందిగ్ధం నెల‌కొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంత‌పురంలో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పోటీలో ఉండ‌టంతో అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ప‌వ‌న్‌పై పోటీచేసే అభ్య‌ర్థి విష‌యంలో టీడీపీ నేత‌లు, ముఖ్యంగా ఏళ్లుగా రాజ‌కీయాల‌ను శాసిస్తున్న జేసీ వ‌ర్గం ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్క‌డి సామాజిక‌వ‌ర్గ […]

తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా క‌ప్పుల త‌క్కెడ‌లో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. వ‌రుస‌గా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జ‌న‌సేన […]

తెలంగాణలో కొత్త పార్టీతో ప‌వ‌న్ పొత్తు..!

ఏపీ, తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న జ‌న‌సేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది. ఏపీలో జ‌న‌సేన‌కు ఇప్ప‌టి నుంచే క్రేజ్ క‌న‌ప‌డుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్ప‌టికే క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించారు. ఇక వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సైతం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభాల‌ను జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని […]

టాలీవుడ్ నుంచి జ‌న‌సేన‌లోకి చేరిక‌లు?

ప్ర‌త్యేక‌హోదాపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఉద్య‌మాల‌కు టాలీవుడ్ హీరోలు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. కానీ హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బ‌హిరంగ స‌భ‌ల ద్వారా ప‌వ‌న్‌ విరుచు కుప‌డ్డారు. హోదాపై ప‌వ‌న్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జ‌న‌సేన వైపు చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం! సినీన‌టుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న‌ హీరో శివాజీ! ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా […]