సునీల్‌ని భయపెడ్తున్న చెల్లి సెంటిమెంట్‌ 

తాజాగా సునీల్‌ నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాలో ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీగల్రాని హీరోయిన్‌గా నటించింది. నటన, డాన్సుల పరంగా ఆమె ఓకే అన్పించినా, కానీ సునీల్‌కు ఆమెతో జోడీ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సునీల్‌ ‘జక్కన్న’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చెల్లెలు మనారా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అదేంటో హీరోయిన్స్‌ చెల్లెళ్లతో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి సునీల్‌కు. అయితే మొదటి కాంబినేషన్‌ ఫెయిల్‌ అయ్యింది. ఇప్పుడు […]

పులిచింతల పంచాయితీ షురూ

విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం […]

సీఎం ని కదిలించిన చిన్నారి.

కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి  కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]

నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షల కోట్లు హాంఫట్

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను సంక్షోభంలోకి నెట్టింది. భారత మార్కెట్లను ఈ వోట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రారంభమైన కేవలం నాలుగు నిమిషాల్లోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. అన్ని లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి సంపద లెక్కేసుకుంటే 98 లక్షల కోట్ల దిగువకు పడిపోయినట్లు తేలినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న మార్కెట్లు ముగిసేనాటికి మొత్తం విలువ 101.4 లక్షల కోట్ల దాకా ఉంది. […]

మల్లన్నపై కేసీఆర్‌ మొండి వైఖరి ఎందుకట!!

మల్లన్న సాగర్‌ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్‌ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్‌ సర్కార్‌ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్‌ చెప్పడం శోచనీయం. కెసియార్‌ ప్రాజెక్టు నిర్వాసితుడో […]

‘సుల్తాన్‌’ నోటికి తాళం పడింది 

‘సుల్తాన్‌’ సల్మాన్‌ఖాన్‌ నోటికి తాళం పడింది. రేప్‌ వివాదంలో ఇరుక్కున్న ఈ కండల వీరుడు ఆ వివాదం తీవ్రతతో జాగ్రత్తపడ్డాడు. ఇకపై ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఎక్కువసేపు ఉన్నా, తక్కువే మాట్లాడతానని చెప్పాడు కూడా. వివాదంపై మాత్రం స్పందించలేదు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇంకా తప్పుగా ప్రచారం చేశారని మాత్రమే సమాధానమిచ్చాడు సల్మాన్‌ఖాన్‌. అయితే అతని తండ్రి, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్నాడు. అదే సంస్కారం సల్మాన్‌ఖాన్‌ కూడా ప్రదర్శించి […]

బ్రెగ్జిట్ బాంబ్ -మార్కెట్ క్రాష్

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా […]

బ్రెగ్జిట్ బాంబ్ -మొదటి వికెట్ పడింది!!

యురోపియ‌న్ యూనియ‌న్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్‌డ‌మ్‌. చారిత్రక రెఫ‌రెండ‌మ్‌లో బ్రిట‌న్ ప్రజ‌లు విడిపోవ‌డానికే ప‌ట్టం క‌ట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాల‌ని ఓటేయ‌గా, 48.1 శాతం మంది క‌లిసుండ‌టానికి మ‌ద్దతు తెలిపారు. మొత్తంగా విడిపోవాలని కోటి 74 లక్షల 10 వేల 742 మంది ఓటేయగా, కలిసుండాలని కోటి 61 లక్షల 41 వేల 241 మంది కోరుకున్నారు. లండన్, స్కాట్లాండ్ క‌లిసుండాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌గా, వేల్స్‌తోపాటు ఇత‌ర ఇంగ్లిష్ షైర్స్ బ్రెగ్జిట్‌కే […]

షాక్ ఇస్తున్న సంపూ ఓవర్సీస్ క్రేజ్

హిట్టు-ఫట్టులతో పనిలేదు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బరిలో ఉన్నాడంటే అందరికీ ఆసక్తే. అతడి సినిమాలు ఎలా ఉన్నా ముందస్తుగా వచ్చే టీజర్లు, ట్రైలర్లను జనాలు తెగ చూస్తుంటారు. తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ నుంచే టాలీవుడ్ లో సంచలనం రేపాడితడు. సరికొత్త అభినయం, ఆహార్యంతో మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో బాక్సాఫీసు వద్ద ఆయన చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ కోవలో సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ మరింత సెన్సేషన్ రేపుతోంది. టైటిలే ఇంత […]