కోలీవుడ్-టాలీవుడ్ ల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది దేవయాని. అప్పట్లో టాప్ హీరోలతో పాటూ యువ హీరోలతోనూ జోడీకట్టి అలరించింది. ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలకు స్వస్తి చెప్పి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి.ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాక మళ్ళీ అంతటి సినిమా ఆమెకి దొరకలేదు.ఏదో అడపా దడపా సినిమాల్లో కనిపించింది అంతే. ఇదిలా ఉంటే, మూవీలకు దూరంగా ఉన్న […]
Category: Latest News
అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్
రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి […]
గూడు కోసం ఎదురుచూపులు
పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో […]
ఆంధ్ర గజనీగా మారుతున్న చంద్రబాబు!!
అన్న మన అధినేతెంటి ఇలా చేస్తున్నారేంటి..? అన్నో మన సారుకు గతాన్ని గుర్తుచేయాలి.. అదేం కాదయ్యా మన సారు మరో గజినీగా మారారు. ఇవి ఎవరి మాటలు అనుకుంటున్నారా.. ఆంద్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ల చర్చలు.., ఈ మద్య ఇలాగే ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరి గురించో కాదు సాక్షాత్తూ వాళ్ల అధినేత చంద్రబాబు గురించే..! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన బాబు గజినీగా మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది […]
‘జనతా గ్యారేజ్’ టీజర్ వచ్చేస్తోంది..
‘శ్రీమంతుడు’తో దర్శకుడిగా కొరటాల శివ, ‘నాన్నకు ప్రేమతో’తో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ జూన్ నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో.. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించిన ఆడియో, టీజర్ రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ వెయింటింగ్ కు ముగింపు పలుకుతూ కొరటాల శివ లేటెస్ట్ గా ఓ ప్రకటన ఇచ్చారు. జులై 6న టీజర్ ను విడుదల […]
చంద్రబాబు చైనా రెండోస్సారి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]
నాని బ్యాక్ గ్రౌండ్ పెద్దదే!!
నాని అంటే ఇప్పుడు తెలీని వారు లేరు. చిన్నపిల్లల్ని, పెద్ద వాళ్లనీ, అన్ని రకాల వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు నాని. ‘ఈగ’ సినిమాలో నాని నటించిన సీన్లు చాలా తక్కువే అయినప్పటికీ ఆ కొద్ది టైంలోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అయిపోయాడు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నాని తాజా సినిమా ‘జెంటిల్‌మెన్’ సూపర్ హిట్ అయ్యింది. సహజ నటుడిగా పేరున్న నానికి ఈ సినిమాతో […]
ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..
కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా […]
భాగ్యనగరం మైనస్ బెగ్గర్స్
భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న […]
