అసదుద్దీన్ నోట ఆ మాట భేష్

ఎక్కడ ఏ ఉగ్ర అలజడి జరిగినా అందరి కన్ను హైద్రాబాద్ పైనే ఉంటుంది.అయితే తాజాగా హైద్రాబాద్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్ర కుట్రను మన NIA చేదించిన విషయం తెలిసిందే. కుట్రకు సూత్రదారులంతా హైద్రాబాద్ కి చెందివారే కావడంతో ఒక్క సారిగా నగరం ఉలిక్కి పడింది.తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి […]

జిల్లా లొల్లి: కెసియార్‌కి తలనొప్పి 

తెలంగాణలో జిల్లాల లొల్లి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎక్కడంటే అక్కడ ఆందోళనలతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. జనగామ జిల్లా డిమాండ్‌ వరంగల్‌ జిల్లాలో ఉధృతమవుతుండగా, గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోరాటం తారాస్థాయికి చేరింది. రహదారి దిగ్బంధనాలు, అధికారుల్ని అడ్డుకోవడం, పోలీసులతో ఆందోళనకారులు తగాదా పడుతుండడం వంటి ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇంకో వైపున హైకోర్టు విభజన కోసం పోరాటం కూడా జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు […]

బాలకృష్ణ రాజకీయ వ్యవసాయం! 

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందుతోంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుండగా ఇంకో వైపున బాలకృష్ణ ‘రైతు’ అనే సినిమాతో వార్తల్లోకెక్కాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రానుంది ఈ సినిమా. అయితే ఇది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిపే సినిమా అని సమాచారమ్‌ వస్తుండడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చ వేడివేడిగా జరుగుతోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దాంతో ఏ కొంచెం […]

అతనే ఓ సూపర్ స్టార్ అయినా కూడా!

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్తో పాటు యూట్యూబ్ సెన్సేషన్గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న […]

శ్రీదేవి అవార్డు అందుకే అందుకోలేదా?

స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎందరో తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది. ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. […]

వినాయక్ మళ్ళీ మెగా క్యాంప్ లోనే

వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగు జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో చరణ్ తరచూ సెట్స్‌కు వస్తున్నాడు. దర్శకుడు వినాయక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మరోసారి ఒక సినిమా చేయాలన్న నిర్ణానికి వచ్చారని అంటున్నారు. గతంలో వినాయక్-చరణ్ కాంబినేషన్‌లో ‘నాయక్’ సినిమా వచ్చింది. ఈ పిక్చర్ మాస్ […]

సెన్సేషన్ సృష్టిస్తున్న రుస్తుం ట్రైలర్

అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో అక్షయ్‌ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్‌ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథానాయకుడి పాత్రకు అక్షయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడంటూ పొగిడేస్తున్నారు. ట్రైలర్ కోసం క్లిక్ చేయండి […]

రిలీజ్ టైం కి రజిని రావడం పక్కా

రజిని అభిమానులకి శుభవార్త .ఆరోగ్య పరీక్షల నిమిత్తమే కాక.. కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అమెరికా వెళ్లారు. ఆయన స్వదేశానికి ఎప్పుడు వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. రజనీ ఈ నెల మొదటి వారంలోనే యూఎస్‌ నుంచి చెన్నై వచ్చేస్తున్నారు. ‘కబాలి’ విడుదలకు ఆయన ఇక్కడే ఉంటారు. ఇక.. మూడో వారం నుంచే తలైవా శంకర్ గ్రాండ్ ప్రాజెక్ట్‌ ‘రోబో 2.0’ షూటింగ్‌లో పాల్గొంటారు. రజనీతో పాటూ ఆయన కుమార్తెల్లో […]

ఆయన మాస్ ఈయన క్లాస్:కలిస్తే రచ్ఛే

మెగా హ్యాట్రిక్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అంటే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో మాస్ ని ఒక ఊపు ఊపేసాడు ఈ మెగా హీరో.కాగా ఈ హ్యాట్రిక్ హీరో కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. అదే క్లాస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో అనుష్క తమన్నా హీరోయిన్లు గా ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. […]