శ్వక్రీడల్లో క్రికెట్ కూడా ఓ భాగం కానుంది. 2024లో రోమ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్‌లో ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు బిడ్‌ను దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఇటాలియన్ క్రికెట్ బోర్డు చీఫ్ సైమన్ గాంబినో వెల్లడించారు. దీన్ని ఐసిసి వార్షిక సమావేశంలో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రోమ్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుందని, ఇందులో క్రికెట్‌ను కూడా చేర్చామని, పూర్తి కమిట్‌మెంట్‌తో ఈ నిర్ణయాన్ని ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించిందని ఫెడరాయిజన్ క్రికెట్ ఇటాలియానా (ఎఫ్‌సిఐ) అధ్యక్షుడు గాంబినో […]
Category: Latest News
ఆ కిరాతకుడు దొరికాడు
తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే రామ్ కుమార్ ఆమె మీద మొజు పెంచుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో రామ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు […]
చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది
చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]
బాంగ్లా భద్రతాదళాలు భళా
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన బంగ్లా ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దెబ్బకు ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు.ఈ ఉదయం […]
బన్నీ మళ్ళీ బుక్ అవుతాడా:’గమ్మునుండవోయ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి అల్లు అర్జున్ ఝలక్ ఇచ్చాడు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు సింగపూర్లో జరుగనున్న ఈ వేడుకల్లో గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర […]
ఆడ, మగ కలవకుండానే
సృష్టి ధర్మం ఏంటంటే, ఆడ మగ కలవడం. ఆ కలయిక సంతానోత్సత్తికి దోహదపడటం. కానీ ట్రెండ్ మారింది. ఆడ, మగ ఒకరితో ఒకరికి పని లేకుండానే సంతానోత్పత్తి జరిగిపోతోంది. బాలీవుడ్ నటుడు తుషార్‌కపూర్ ఇటీవల ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. సుస్మితాసేన్‌కి ఇద్దరు పిల్లలున్నారు. వారిని ఆమె పెంచుకుంటోంది. అమీర్‌ఖాన్ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. షారుక్‌ఖాన్ తన భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు ముందే తండ్రి అయినా, సరోగసి ద్వారా […]
చినబాబుకి పెద్ద పెద్ద కష్టాలు:నవ్వొద్దు ప్లీజ్!
చంద్రబాబును… ఆయన మనవడు దేవాన్షు గుర్తు పట్టలేకపోతున్నాడని… లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని…. తెల్లవారుజామునే నిద్ర లేచి అర్థరాత్రి వరకు ఇంటికి రావట్లేదన్నారు ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన […]
బన్నీ వద్దన్నాడు..సాయిధరమ్ ఓకే చేసాడు
‘సుప్రీమ్’తో మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘తిక్క’తో బిజీగా ఉన్న ఈ యువహీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మల్టీస్టారర్‌కు సంతకం చేశాడు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర ఇదట. గౌతమ్ ముందుగా అర్జున్‌నే కాంటాక్ట్ చేశాడని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. అర్జున్ కాదన్నా.. ఆయన బంధువే అయిన సాయికి కథ వినిపించగా వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు. గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో సాయి ధరమ్ […]
‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]
