హేమకు నాగ్ అంటే ఎందుకంత ఇష్టం?

సీనియర్ సహాయ నటి హేమ గురించి తెలియని వాళ్లుండరు.ఎక్కడ యే సినిమా ఫంక్షన్ జరిగినా అక్కడ వాలిపోయి అంత తానే అన్నట్టు ఉంటుంది.ఈ మధ్యన పరభాషా సహాయనటుల టాలీవుడ్ మీద దండయాత్ర చేస్తుండడంతో పాపం అమ్మడు పోటీలో కాస్త వెనకపడింది.ఇంకేముంది దీన్ని అధికమించడానికి మొత్తం టాలీవుడ్ తో హీరోలపై పొగడ్తల ఉపన్యాసం దంచేసింది.

హేమ ఎన్టీఆర్, బన్నీలతో మొదలుపెట్టి నాగార్జున,బ్రహ్మానందం ఇలా అందరిపై పొగడ్తల వర్షం కురిపించింది. బన్నీ ఎనర్జీ అంటే తనకు చాలా ఇష్టం అని ఆయన రబ్బరు మనిషిలా డ్యాన్స్ చేస్తాడు అంది. ఆయన్ని చూస్తే పాపం హేమకి జెలసీగా వుంటుందట. ఇక ఎన్టీఆర్ రోబో లాంటి వ్యక్తి. ఎన్ని పేజీల డైలాగులనైనా ఇట్టే స్కాన్ చేసి సింగిల్‌టేక్‌లో ఓకే చేయిస్తాడు… అంటూ హేమ వారిద్దరిపై పొగడ్తలు కురిపించింది.

ఇక నాకు నాగార్జున అంటే కూడా చాలా ఇష్టం. వెయ్యిమందిలో ఉన్నా నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన బిజెనెస్‌మేన్ కావచ్చు… కానీ నిజజీవితంలో ఆయనలో కమర్షియాలిటీ కనిపించదు అని చెప్పుకొచ్చింది.ఏమో హేమలో నాగార్జునకి ఏమి నచ్చిందో అని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.అంతేనా లేకపోతే నాగార్జునకి ఈ రకంగా గాలం వేసి మొత్తం అక్కినేని ఫ్యామిలీ సినిమాలతో మళ్ళీ బిజీ కావాలని హేమ ప్లాన్ వేసిందేమో.అయినా హేమ పిచ్చి కానీ నాగార్జున ఇలాంటి సిల్లీ ప్లాన్స్ కి పడేరకం కాదని ఈ అమ్మడికి తెలీదేమో.

ఇక బ్రహ్మానందంతో తనది మంచి జోడీ అంటోంది. ‘అతడు’ చిత్రంలోని కాఫీ కప్పు సీన్ అందరికీ గుర్తుండిపోయింది. బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రవైజ్ చేస్తాడు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగ్స్‌కు కొన్ని అదనంగా జోడిస్తాడు. దానికి దీటుగా నేను కూడా రిటార్ట్ ఇవ్వగలను. అందుకే మా జోడీ బాగా సక్సెస్ అయింది.పాపం బ్రహ్మానందం ఈ మధ్య కొత్త తరం హాస్యనటులతో రేసులో కొంత వెంకుకబడ్డాడు ఇక ఆయన హేమకేంచేస్తాడు చెప్పండి.

ఇప్పటివరకు నేను400 చిత్రాల వరకు చేశాను. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్, లేడీ డాన్ వంటి పాత్రలు చేయాలని ఉంది.మన అదృష్టం కొద్దీ అటువంటి పత్రాలేవి ఇంతవరకు హేమకి రాలేదనుకోండి అది వేరే విషయం.ఇక నిర్మలమ్మలాగా ఈ ఇండ్రస్టీలోనే వందేళ్లు జీవించాలని ఉంది. అవకాశాలు లేకపోతే అమ్మ, అమ్మమ్మ వంటి పాత్రలు చేస్తాను. అవీ లేకపోతే ఇక్కడే ఇంకో పని చూసుకుంటాను, అసిస్టెంట్ డైరెక్టర్‌గానో, ప్రొడ్యూసర్‌గానో మారుతాను తప్ప ఈ ఇండ్రస్టీ వదిలి ఎక్కడికి పోను.. అంటూ చెప్పుకొచ్చింది హేమ.