‘నేను లోకల్‌’ అంటున్న నాని!

యూత్‌ హీరోస్‌లో నాని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే కొత్తదనం గ్యారంటీ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగించాడు. ‘జెంటిల్‌మన్‌’తో ఈ భావనకు నూరుశాతం న్యాయం చేశాడు. ప్రస్తుతం నాని చేస్తున్న ప్రాజెక్టుల్లో త్రినాథ్ రావు తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ చిత్రానికి ‘నేను లోకల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘నేను లోకల్’ అనే […]

కబాలి ప్రొమోషన్ పీక్స్!

ఇప్పటి వరకు సినిమా పోస్టర్లు గోడలు..బస్సుల మీదే కనిపించేవి. కాని ఇప్పుడు అది విమానాలకూ పాకింది. రజినీకాంత్‌ తాజా చిత్రం కబాలీ ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కనుంది. దేశంలోనే తొలిసారిగా విమానాల ద్వారా ప్రచారం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా రిలీజ్ రోజున బెంగళూరు నుండి చెన్నైకి ఎయిర్ ఏసియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. సినిమా విడుదల రోజు ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు బెంగళూరు నుంచి బయలు దేర వెళ్లే విమానం ఏడు […]

అందరి చూపు చైతు వైపు

తొలి సినిమాతోనే ఒక ప్రయోగం చేశాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ‘జోష్‌’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పరాజయం అందుకున్నాడు. యూత్‌ని ఆలోచింపచేసే ఈ సినిమాలో నాగచైతన్య తన నటవిశ్వరూపం చూపించినప్పటికీ అది అంతగా కనెక్ట్‌ కాలేదు. ఆ తర్వాత ‘ఏ మాయ చేశావె’ సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ వెంటనే మాస్‌ సినిమాలు ట్రై చేసి మళ్లీ నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు మాస్‌ జోలికి పోకుండా మళ్లీ లవర్‌ బాయ్‌లా మారిపోయాడు. చైతూ […]

సల్మాన్ వివాదం అందుకోసమేనా!

ఒక్క క్షమాపణ చెబితే వివాదం సద్దుమణిగిపోతుంది. తద్వారా మహిళల్ని ఆయన గౌరవించినట్లవుతుంది. కానీ బాలీవుడ్‌ కండల హీరో సల్మాన్‌ఖాన్‌ క్షమాపణ చెప్పబోనంటున్నాడు. షూటింగ్‌ తర్వాత తన కష్టం గురించి చెబుతూ, రేప్‌కి గురైన స్త్రీలా నా పరిస్థితి ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేసులు కూడా నమోదయ్యాయి. మహిళా సంఘాలు సల్మాన్‌ఖాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సల్మాన్‌ఖాన్‌ ఈ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. బాలీవుడ్‌లో చాలామంది సల్మాన్‌ఖాన్‌ సన్నిహితులు అతని తీరుని తప్పుపట్టడం చూశాం. […]

ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!

అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్‌ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్‌, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు […]

అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు

అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని […]

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా సిద్ధారామయ్య

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య. ఖరీదైన వాచ్ వ్యవహారం.. కాకి వాలిందని కారు మార్చడం.. పబ్లిక్ లో కార్యకర్త ముద్దు పెట్టడం ఇలా రోజూ ఏదో ఇష్యూలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయన జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని స్కూళ్ల లైబ్రరీలో తప్పనిసరి అంటూ సర్క్యులర్ ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల లైబ్రరీల్లో ఈ పుస్తకం తాలూకు కనీసం రెండు కాపీలు పిల్లలకు అందుబాటులో ఉంచాలని జీవోలో పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. […]

సల్మాన్ అవి చేయడట!

సల్మాన్ ఖాన్.. ముందు-వెనకా.. ప్రస్తుతం వస్తున్న హీరోలు… అంతా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్‌ రోషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. యాంటీ హీరోగా వీరంతా ప్రేక్షకులను మెప్పించారు. కానీ సల్లూ భాయ్ మాత్రం అలాంటి రోల్‌ ఒక్కటి కూడా చేయలేదు. ఇదే విషయమై స్పందిస్తూ తనకు విలన్ పాత్రలంటే నచ్చదని చెప్పారు. తానెప్పుడూ హీరోగానే ఉండాలనుకుంటున్నానని.. విలన్ రోల్స్ చేయనని […]

కబాలి పోస్టర్ కాఫీ కొట్టారా?

రజినీకాంత్‌ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కబాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో… అన్నే వివాదాలకు కారణమౌతుంది. తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. మరో వైపు విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది […]