న్యూడ్ ఫోటోలు అడిగిన నెటిజన్.. చిన్మయి అదిరిపోయే సమాధానం..!

చిన్మయి శ్రీపాద..ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్లేబాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓ విషయంపై ఈమె వార్తల్లోకెక్కింది. న్యూడ్స్ పంపాలంటూ చిన్మయికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు. ఆ యువకుడు చేసిన మెసేజ్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘దయచేసి స్వయంతృప్తి చెందు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే గైనకాలజిస్టుతో మాట్లాడు. వాళ్లు ఎలా చేయాలో చెబుతారు అలాగే హైజీన్ ప్రాక్టీస్ చేయి. స్వయంతృప్తి చెందడం తప్పేకాదు..అని రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా ఇంకొన్ని విషయాలను […]

ఆ ఇబ్బందుల్లో శృతి..?

ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాస‌న్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమల్ హాసన్ ముద్దు బిడ్డ అయిన శృతి హాస‌న్ అటు తెలుగు, ఇటు తమిళంలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన డ్యాన్స్, నటన, అందంతో కుర్రాళ్ల మనసులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈమె అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈమె ఓ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె ఇండిపెండెంట్‌గానే ముందుకు […]

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 […]

కేరళ ‘ ఐరన్ లేడీ’ మృతి…!

కమ్యూనిస్టులు..నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తుంటారు. ప్రజల కోసం ధర్నాలు, పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్రజలకు చెందాల్సిన న్యాయం కోసం పోరాడుతుంటారు. ఆ కోవకు చెందిన ఓ యోధురాలు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. కేరళలోని దిగ్గజ కమ్యూనిస్ట్ కేఆర్ గౌరీ మంగళవారం తన తుదిశ్వాస విడిచారు. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపాయి. 102 సంవత్సరాలు వయసుగల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం రీత్యా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. […]

ఇండియన్ టీంకి హెడ్‌ కోచ్ గా రాహుల్ …?

కరోనా కారణంలో ఈసారి ఐపిఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో కూడా బీసీసీఐ వెనకడుగు వేయలేదు. ఇంగ్లండ్ లో ఐపీఎల్ ను పెట్టడానికి సన్నద్దమవుతోంది. మరో వైపు న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగానే మరోక […]

బ్రేకింగ్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఎక్కడంటే.. ?

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ అయ్యింది. ఈ తరుణంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి మృతి చెందారు. గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు […]

రాజ్ తరుణ్ బ‌ర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండ‌ప్ రాహుల్ ఒక‌టి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ త‌రుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం!

దేశ‌వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా విరుచుకు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. అభిజిత్ త‌ల్లి లక్ష్మి ప్రసన్నకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆక‌ట్టుకుంటున్న `శ్రీదేవి సోడా సెంటర్` ఫ‌స్ట్ గ్లింప్స్!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు సుధీర్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ చిత్రం ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఏదో డిఫ‌రెంట్ క‌థ‌తోనే సుధీర్ బాబు వ‌స్తున్న‌ట్టు అర్థం […]