న్యూడ్ ఫోటోలు అడిగిన నెటిజన్.. చిన్మయి అదిరిపోయే సమాధానం..!

చిన్మయి శ్రీపాద..ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్లేబాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓ విషయంపై ఈమె వార్తల్లోకెక్కింది. న్యూడ్స్ పంపాలంటూ చిన్మయికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు. ఆ యువకుడు చేసిన మెసేజ్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘దయచేసి స్వయంతృప్తి చెందు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే గైనకాలజిస్టుతో మాట్లాడు. వాళ్లు ఎలా చేయాలో చెబుతారు అలాగే హైజీన్ ప్రాక్టీస్ చేయి. స్వయంతృప్తి చెందడం తప్పేకాదు..అని రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా ఇంకొన్ని విషయాలను కూడా చర్చించింది.

నువ్వు ఇలా మహిళలను న్యూడ్ పంపాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు, అది లైంగిక వేధింపుల కిందికి వస్తుంది. మనిషిగా ఉండడం నేర్చుకో, లేదా నీ తండ్రితో ఓసారి మాట్లాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆయన నీకు నేర్పిస్తాడని నమ్ముతున్నా, కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండు’ అంటూ మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్‌ను చిన్మయి పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్మయి రిప్లై కి చాలా మంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest