బ్రేకింగ్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఎక్కడంటే.. ?

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ అయ్యింది. ఈ తరుణంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి మృతి చెందారు. గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు తీశారు.

నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఫ్యాక్టరీ నుంచి వాయ కాలుష్యం అవుతోందని పశువులు, పంట పొలాలు పాడవుతున్నాయని గతంలో స్థానికులు ధర్నాలు చేశారు. కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.