దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్‌..!?

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన‌ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు స‌ర‌స‌న ఈ అమ్మాయి గురించి మీకు […]

ఆ స్టార్ హీరో సినిమాలో రాజ‌శేఖ‌ర్ కూతురుకు బంప‌ర్ ఆఫ‌ర్?!

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్ర‌స్తుతం శివానీ తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే సినిమాలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే మొద‌టి చిత్రం ఇంకా విడుద‌ల కాక‌ముందే.. శివానీని ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో హిట్ […]

మెసేజ్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్న రేణు దేశాయ్‌!

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వేగం ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్ కొర‌త కార‌ణంగానే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే […]

ఒక్కో ఇంటర్వ్యూకు టీఎన్‌ఆర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?

ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మ‌ర‌ణించ‌డాన్ని ఇంకా ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయ‌న‌. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్ర‌స్ట్ చూపేవారు. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పుష్ప మేక‌ర్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గ‌త రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. […]

kgf2

దసరా కానుకగా కెజియఫ్‌ 2..?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీయఫ్‌’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’. ఈ సినిమా జులై 16న తెరపైకి రావాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో థియేటర్ల మూతపడాయి. అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు […]

kiyara advani

కియారా రెమ్యునరేషన్ ఏంటంటే..?

భారత్ నేను అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. వినయ విధేయ రామ సినిమాలలో రామ్ చరణ్ సరసన నటించి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కియారా అద్వానీ అడిగిన ఆమెను రెమ్యునరేషన్ చెల్లించలేక కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేష న్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. […]

bruma

వ్యాక్సిన్‌ తీసుకున్న బుమ్రా..?!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు సెలెబ్రెటీలు, క్రికెటర్లు, ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న బుమ్రా.. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, పుజారా, రహానే తదితరులు వ్యాక్సిన్ తొలి […]

wine shopes

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : బారులు తీరిన మద్యం ప్రియులు..!

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రాల్లో ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఇక రాష్ట్రంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటన వేలువడడంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. కరోనాను పట్టించుకోకుండా, […]