భట్టి సరే.. మోత్కుపల్లి ఎందుకొచ్చినట్టు?

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన దళితబంధు సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగుకు వచ్చిన వారంతా ఆ ఇద్దరు నాయకులను ప్రత్యేకంగా చూశారు. అరె.. వీరు కూడా వచ్చారా అన్నట్లున్నాయి వారి చూపులు. ఆ ఇద్దరూ ఎవరంటే.. ఒకరు మల్లు భట్టి విక్రమార్క, మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో విస్తరించడంపై ఈ సమీక్ష నిర్వహించారు. మరో ఐదు మండలాల్లో (వేర్వేరు నియోజకవర్గాల్లో) అమలు చేయాలని సర్కారు […]

మరో సినిమా లైన్లో పెట్టిన రామ్.. దర్శకుడు ఎవరంటే..!

తెలుగులో అపజయం ఎరుగని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్- 2 సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. తాజాగా హీరో రామ్ పోతినేని -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు […]

డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?

ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]

విషాదంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి .. కారణం ఏమిటంటే..?

ప్రముఖ యాంకర్ అలాగే నటిగా గుర్తింపు పొందిన శ్రీముఖి ఇంట్లో సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అమ్మమ్మ సోమవారం ఉదయం మరణించడంతో శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన అమ్మమ్మ తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది.. శ్రీముఖి తన పోస్ట్ ద్వారా.. అమ్మమ్మ అంటేనే ఎనలేని ప్రేమ.. జీవితంలో నాకు ఎన్నో విషయాలను నేర్పించింది ఎప్పుడూ చాలా హుషారుగా ఉండేది.. నాకు కూడా ఎప్పుడూ సంతోషాన్ని పంచేది.. […]

సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..?

మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం పై ఇంకా ఆయన అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడంతో ఎప్పుడు కోలుకుంటాడు అన్న టెన్షన్ నెలకొంది ఆయన అభిమానులలో.. ఇక హీరో మోహన్ బాబు తన కూతురుతో కలిసి అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ ను పరామర్శించాడట. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తను రెండు మూడు రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలియజేశాడు. ఇక […]

రవితేజ సినిమాను వదులుకున్న స్టార్ హీరోస్ వీళ్లే..!

హీరో రవితేజ సినిమా ఇండస్ట్రీలో కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు. మొదట ఈ హీరోగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చాడు. ఆతర్వాత సినిమా హీరోగా ఎదిగాడు. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం డాన్ శీను. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాను వదులుకున్న కొంత మంది స్టార్స్ గురించి తెలుసుకుందాం. ఈ చిత్రంలో శ్రీహరి నటన ఎంతో అద్భుతంగా […]

స్వాతిముత్యంగా బెల్లంకొండ గణేష్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా?

కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ గణేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల […]

బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]

శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ దంపతులు..?

టాలీవుడ్ అందాల తార శ్రీయ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీయ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం రోజు ఉదయం వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న శ్రేయ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. […]