ప్రముఖ యాంకర్ అలాగే నటిగా గుర్తింపు పొందిన శ్రీముఖి ఇంట్లో సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అమ్మమ్మ సోమవారం ఉదయం మరణించడంతో శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన అమ్మమ్మ తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది..
శ్రీముఖి తన పోస్ట్ ద్వారా.. అమ్మమ్మ అంటేనే ఎనలేని ప్రేమ.. జీవితంలో నాకు ఎన్నో విషయాలను నేర్పించింది ఎప్పుడూ చాలా హుషారుగా ఉండేది.. నాకు కూడా ఎప్పుడూ సంతోషాన్ని పంచేది.. తాను ధైర్యవంతురాలు మాత్రమే కాదు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కూడా.. అమ్మమ్మ తో పాటలు పాడడం డాన్స్ చేయడం వంటివి మిస్ అవుతాను.. ఐ లవ్ యు అమ్మమ్మ.. నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి థాంక్స్.. నా జీవితంలో నేను విన్న ప్రేమకథల్లో అమ్మమ్మ తాతయ్యల ప్రేమ కథ ఒకటి. అయితే స్వర్గంలో మీ ప్రేమ కథ తిరిగి కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను అంటే శ్రీముఖి రాసుకొచ్చింది..
ఇక ఒకవైపు శ్రీముఖి ఇంట్లో విషాదఛాయలు అనుకుంటే మరోవైపు ఉత్తేజ్ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఇక ఉత్తేజ్ కూడా భార్య వియోగం పొందాడు.