పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో బారి బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రమ్ కి మంచి పేరు, పవన్ కెరీర్ లోనే ఖుషీ సినిమా తరువాత బంపర్ హిట్ అయి క్రేజీ కాంబో గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారికాహాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బారి హైప్ తో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాకు టైటిల్ విషయం లో ఇటు దర్శకుడు త్రివిక్రమ్ అలాగే నిర్మాత కాస్త గందర గోళం లో ఉన్నారు, అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి పలు టైటిళ్లు వినబడుతున్నాయి. ‘ఇంజినీర్ బాబు’, ‘దేవుడే దిగి వస్తే’, ‘పరదేశ ప్రయాణం’ వంటి టైటిళ్లు ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే అభిమానుల అంచనాలను అధిగమించే రేంజ్ లో ఈ సినిమాకు తాజాగా ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.