ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనగానే భారీ బడ్జెట్ బడా సినిమాలే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా ఫైనల్ గా.. వాళ్లకు దక్కిన సక్సెస్ లు, వాళ్ళ సినిమాల కలెక్షన్స్ బట్టి హీరోల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాగే.. స్టార్ హీరోల రేంజ్.. ప్రజెంట్ ఎలా ఉంది అనేది.. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు విటి సక్సస్‌లు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్క హీరో సక్సెస్ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. పాన్ ఇండియా లెవెల్ లో హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల విషయంలో చర్చలు నడుస్తున్నాయి.
ఇండియాలో ఉన్న హీరోలు అందరూ సాధించిన కలెక్షన్స్‌ను బట్టి.. వాళ్లకు ఉన్న క్రేజ్‌ని బట్టి.. ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అయినా.. ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయాయి. అయినా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను కల్లగొట్టాయి. ఇక.. చాలా కాలం గ్యాప్ తర్వాత సలార్, కల్కి సినిమాలతో మరోసారి మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో.. బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నెంబర్ వన్ పాపులర్ స్టార్ హీరోగా ప్రభాస్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఇక.. రెండవ స్థానంలో.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నిలిచాడు.
అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన జవాన్ సినిమాతో సూపర్ హిట్ సాదించి.. తనని తాను స్టార్ గా నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో క్రేజ్ అంతకు అంతకు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మూడవ పొజిషన్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభంజనం సృష్టించాడు. ఏకంగా రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మరింత హైప్‌ను పెంచేస్తున్నాడు. ఇక ప్రజెంట్ అట్లీ డైరెక్షన్‌లో బన్నీ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు.. ఏ రేంజ్ లో కలెక్షన్‌లు కలగొడతాడు వేచి చూడాలి. అలా.. ప్రస్తుతం పాన్ ఇండియన్ షేక్ చేస్తున్న టాప్ 3 హీరోలలో మన తెలుగు హీరోలే ఇద్దరు ఉండడం విశేషం. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి మన తెలుగు నటులకు పాన్ ఇండియాలో దక్కిన గొప్ప గౌరవ అనడంలో సందేహం లేదు.