మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రూపొందుతుంది. అయితే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. ఈ సినిమాకు త్రివిక్రమే రచయితగా వ్యవహరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులంతా ఎంతగానో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది.
అయితే.. ఈసారి త్రివిక్రమ్ రచయితగా కాదు డైరెక్షన్‌లో వెంకీ మామ నటించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై మంచిహైప్ మొదలైంది. నిజానికి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా రావాల్సి ఉండగా.. పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తో బన్నీ.. త్రివిక్రంను పక్కనపెట్టి తమిళ్ డైరెక్టర్ అట్లీ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ చేసేదేమీ లేక.. తన నెక్స్ట్ కథతో వెంకటేష్ హీరోగా సెట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ బ్లాస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాను వచ్చే ఎడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారట.
కానీ.. ట్విస్ట్ ఏంటంటే త్రివిక్రమ్ కంటే ముందు అనిల్ రావిపూడి సినిమాలను వెంకటేష్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అంటే అనిల్, చిరంజీవి సినిమా ఫినిష్ చేసిన తర్వాతే.. వెంకటేష్ – త్రివిక్రమ్ తో సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తాడు. ఇప్పటికే గుంటూరు కారం తర్వాత ఏడాదిన్నరగా బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్.. మళ్ళీ అనిల్ సినిమా కంప్లీట్ అయ్యేవరకు వెంకీ కోసం వేచి చూడాల్సిందే. ఆ తర్వాత గానీ వెంకీ – త్రివిక్రమ్ సినిమాకు డేట్లు ఇవ్వలేడట. ఈ లెక్కన వచ్చేయేడాది సమ్మర్‌కు అయినా సినిమా కంప్లీట్ అవుతుందా.. లేదా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.