ఫుల్ స్వింగ్ లో వార్ 2.. కూలీని క్రాస్ చేసి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఆయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా మెరిసిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. అదే రోజున కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో.. కూలి మూవీ తెర‌కెక్కింది. రెండు సినిమాల మధ్యన భారీ క్లాష్ నెలకొంది.

ఇక ఈ భారీ క్లాష్‌ కోసం.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఎంతగానో ఎదురు చూసింది. రెండు సినిమాల్లో ఎవరు విన్నార్‌గా నిలుస్తారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. నిన్నటి వరకు.. సినిమా ఓపెన్ బుకింగ్స్‌లో వార్ 2 ను మించిపోయి కూలీ కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసింది. ఓపెనింగ్ బుకింగ్స్ లో జోరు చూపించింది.ఈ క్రమంలోనే డే 1 ముందు వరకు కూడా.. బుక్ మై షో హావర్లీ ట్రెండింగ్‌లో కూలి నిలిచింది.

అయితే.. తాజాగా రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూలి సినిమాకు వచ్చిన క్రేజ్ ముందు వార్ 2 కాస్త డౌన్ అయినట్లు కనిపించినా.. ఇప్పుడు డే 2 రిజల్ట్‌లో వార్ 2 కూలి పై డామినేషన్‌ను చూపించింది. ఉదయం కూలీ 13 వేల టికెట్లతో ట్రెండింగ్ లో ఉంటే.. వార్ 2 ఏకంగా 14 వేల టికెట్లతో టాప్ గా నిలిచింది. ఇది గంట గంటకు మరింతగా పెరుగుతున్న క్రమంలో.. మధ్యాహ్నానికి కూలి రూ.39వేల టికెట్స్ తో ఉంటే.. వార్ 2 ఏకంగా.. రూ.61 వేల టికెట్స్ తో ర్యాంపేజ్‌ చూపించింది. మొత్తానికి డేటు నుంచి వార్ 2 లెక్కలు మారనున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలోనే సెకండ్ డే కలెక్షన్స్ లో కూలీ రికార్డ్‌ను వార్ 2 బ్రేక్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.