వార్ 2 వర్సెస్ కూలీ.. ఫస్ట్ డే రూ. 100 కోట్లు కొల్లగొట్టే దమ్మున్న మూవీ..!

మోస్ట్ ట‌ఫెస్ట్ కోల్డ్ వార్ కొద్ది గంటల్లో మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ పోటీలో నువ్వా, నేనా అన్నట్లుగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ప్రాంతాల వారిగా రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ రేంజ్‌ మారుతున్నా.. ఓవరాల్ గా మాత్రం రెండు భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్‌గాను.. ఇప్పటికే వార్ 2, కూలి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సిద్ధమవుతున్న ఈ రెండు సినిమాలు.. మొదటి రోజు కలెక్షన్‌స్‌తో కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతాయి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా.. బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక సినిమా మొదటి రోజు రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం కష్టమే కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ బుకింగ్స్ ఇప్పటికే జోరు అందుకున్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన టికెట్ రేట్లు కారణంగానూ ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే.. ఖచ్చితంగా వార్ 2.. రూ.100 కోట్ల‌ మార్క్‌ మొదటి రోజే ఎంట్రీ ఇవ్వనుంది. ఇక వార్ 2 కంటే మరింత ఎక్కువగా కూలి సినిమా వ‌సూళ్ల‌ను కొల్లగొట్టనుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజులోనే రూ.140 కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఈ రేంజ్‌లో రజనీకాంత్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఆయన స్టార్‌డం.. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ మానియా సినిమాకు మరింత ప్లేస్. ఇక దానికి తోడు..నాగర్జున, మలయాళ నటుడు ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహీర్, బుట్ట బొమ్మ పూజ హెగ్డే, అమీర్ ఖాన్‌ లాంటి స్టార్ కాస్టింగ్ అంత సినిమాలో మెరుస్తుండడంతో.. కూలి సినిమాకు మరింత హైప్‌ నెలకొంది. ఓవర్సీస్‌లోను ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ 2 మిలియ‌న్ డాలర్లను దాటిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. ఓపెనింగ్స్ లో ఈ రెండు సినిమాలు మొదటి రోజు కలెక్షన్స్ తోనే రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డు కొల్లగొట్టడం ఖాయం అంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. వీటిలో ఏ సినిమా కంటెంట్ బాగుంటే.. అది ఎక్కువ రోజులు థియేటర్లో నిలబడుతుంది. మిగిలిన సినిమా ఓపెనింగ్స్ తో సరి పెట్టుకోవాల్సిందే. మరి ఈసారి బరిలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.