ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా రాణిస్తూనే.. మరోపక్క సైన్ చేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో బిజీ అవుతున్నాడు. తాజాగా.. హరిహర వీరమల్లు షూట్‌ను కంప్లీట్ చేసిన ఆయన.. ఇటీవల ఓజీ సినిమా షూట్‌ను కూడా ముగించుకొని ఉస్తాద్ సెట్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా.. ఈ క్రమంలోనే ఓజి మేకర్స్ గంభీర్ షూట్ పూర్తి చేశాడంటూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుందంటూ మేకర్స్ తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఇప్పుడు ఓజి షూటింగ్ పూర్తి అవడంతో.. అనుకున్న టైంకి అంటే.. సెప్టెంబర్ 25న సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. కానీ.. ఇక్కడ అసలు మేటర్ ఏంటంటే గత కొద్ది రోజులుగా పవన్ సినిమాల రిలీజ్ విషయంలోనే అవాంతరాలు ఎదురవుతూ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో పక్కన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. క్రేజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో.. ప్రియాంకా అరులు మొహన్ హీరోయిన్గా మెరుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. కాగా ఇందులో మరో హాలీవుడ్ నటుడు.. కియిచీ అండో కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఈ జపనీస్ యాక్టర్ ఆ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఆయన రియాక్ట్ అవుతూ.. ఓజీ సినిమా కోసం కటక్ ఫైట్ రిహార్సేల్స్ చేస్తున్నానంటూ వీడియోను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంతకీ ఈ కయీచీ అండో ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన కయిచి.. పారిస్ ఫ్యాషన్ వీక్, న్యూ ఇయర్ ఫ్యాషన్ వీక్‌లలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. తర్వాత నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే బెలూన్ ఫిలిం ఫెస్టివల్ సినిమాలో ఆయన నటించిన కీలక పాత్రకు గాను.. గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ ఈ కెయిచి అండో మెరిసాడు. కాగా.. ఈ క్రమంలోనే హాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ.. రాణిస్తున్న కెయిచి.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.