కొన్నిసార్లు అన్ని మనం అనుకున్నట్లు జరుగుతూ ఉండవు .. మనం ఊహించినవి ఎక్స్పెక్ట్ చేయనివి కూడా జరుగుతూ ఉంటాయి. నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయంలోనూ అదే జరిగింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ..పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి. నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అనుకుంది.
అమితాబచ్చన్ – దీపికా పదుకొనే – కమల్ హాసన్ – దిశా పటానీలు కూడా ఈ సినిమాలో నటించారు . ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్ గా తీసుకున్నాడు అని ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేసారు . అయితే సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా అసలు ఈ సినిమాలో హీరోయిన్ దిశా పటానిని ఎందుకు పెట్టారు..? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
సినిమాలో ఆమె పాత్ర డమ్మీ.. అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు .. ఒక్క పాటలో తప్పిస్తే ఎక్కడా కనిపించదు. సాఫీగా సాగిపోతున్న కథలో అలాంటి హీరోయిన్ ని ఎందుకు చూస్ చేసుకున్నావ్ నాగ్ అశ్వీన్ అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు . అసలు ఆ తర్వాత ఆమె పాత్ర ఏమైపోయింది ..?అనే విషయాన్ని కూడా చూపించలేదు . కేవలం పాట కోసం మాత్రమే దిశా పటాన్ని పెట్టినట్లు అనిపిస్తుంది. ఉన్న సీన్స్ కూడా ఏదో ఫ్లోలో కావాలని అంటి పెట్టినట్లు తెరకెక్కించావు కానీ దిశా ఈ సినిమాకి వేస్ట్ మరి ఎందుకు ఆమెను చూస్ చేసుకున్నావ్..? ఇది బిగ్ బిగ్ మైనస్ పాయింట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!