మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్పతో ఇక్కడ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇందులో అతడు పోషించిన భన్వర్ సింగ్ షేకావత్ పాత్ర మదిలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. పుష్ప 2లోను ఈ పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని సమాచారం. ఇటీవల ఆవేశంతో మరో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఫాహద్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
ఇటీవల స్కూల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఫాహద్.. తనకున్న ఓ అరుదైన వ్యాధి గురించి రివీల్ చేసి ఫాన్స్ కు షాక్ ఇచ్చాడు. కేరళలోని చిల్డ్రన్ హబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కు వెళ్ళిన ఫాహద్.. తాను ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్) వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వివరించాడు. తన 41 ఏళ్ల వయసులో అరుదైన వ్యాధి బారిన పడినట్లు చెప్పిన ఫాహధ్.. దానికి చికిత్స ఉందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చిన్నతనంలోనే బయటపడి ఉంటే క్యూర్ చేయవచ్చని.. కానీ 41 ఏళ్ల వయసులో అది బయటపడిందంటూ తన పరిస్థితిని చెప్పుకొచ్చాడు.
అయితే ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ కు అరుదైన వ్యాధి ఉందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అయితే ADHD వ్యాధి ఉన్నవారు ఏ విషయంపై ఏకాగ్రత పెట్టలేరని, ధ్యాస ఉండదని, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంప్లాసిటీ లాంటి లక్షణాలను కలిగి ఉంటారని.. నిపుణులు చెబుతున్నారు. వారే క్రియేటివ్ గా ఉండాలని భావిస్తారని.. సైకలాజికల్ గా ఎంతో స్ట్రెస్ తీసుకుంటారని.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారని చెబుతున్నారు.