ఆ కల్ట్ డైరెక్టర్ మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్.. అతని పేరు అంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి..!!

కొన్ని కాంబినేషన్ సెట్ అయ్యాయి అంటే చాలు.. ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ తాజా కాంబో నెటింట తెగ వైరల్ గా మారింది. తమిళ్ డైరెక్టర్ వెట్రిమార‌న్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ కథ‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. డైరెక్టర్ వెట్రిమార‌న్ అనగానే ఆడుకలం, విసారనై, వడ చెన్నై, అసురన్, విడతలై సినిమాలు ట‌కున్న గుర్తుకొస్తాయి. సామాజిక సమస్యల్లోని తీవ్రతను కఠినంగా, నిజాయితీతో చూపించడంలో నిర్మొహ‌మాటంగా తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు డైరెక్టర్ వెట్రిమారన్.

DC Exclusive: Ram Charan meets Vetrimaran, what's brewing?

వెట్రిమారన్ తెర‌కెక్కించిన ప్రతి సినిమా దాదాపు ఇలానే ఉంటుంది. అందులో పాత్రలే కనిపిస్తాయి తప్ప.. ఆ పాత్రలో నటించిన స్టార్లు ఎవరు అనేది కనిపించదు. అలాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అంటూ తెలియడంతో కథ‌ ఎలా ఉంటుంది అనే ఊహ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నేరుగా తెలుగు సినిమా చేయాలనే కోరిక వెట్రిమార‌న్‌లో ఎప్పటినుంచో ఉందట. గతంలో తారక్ కి కూడా వెట్రిమార‌న్ ఒక కథ చెప్పినట్లు సమాచారం. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు.

Ram Charan, Shankar's 'Game Changer' shoot cancelled at the last minute.  Here's why - India Today

అయితే తాజాగా రాంచరణ్ కు వెట్రిమార‌న్ ఒక సబ్జెక్ట్‌ వినిపించడం.. చరణ్ కు కూడా అది బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్‌లో నటిస్తున్న చెర్రీ.. తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈ బిజీ లైనప్‌ తరువాత రామ్ చరణ్ వెట్రిమోరన్‌తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.