‘ పుష్ప 2 ‘ తో ఆ క్రేజీ రికార్డ్ సృష్టించిన శ్రేయ ఘోషల్.. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారి..?!

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రేయ ఘోషల్. పుష్ప 2లో ఓ సాంగ్ తో ఆమె తాజాగా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రానుంది. అది ఫిమేల్ ఓరియెంటెడ్ సాంగ్ అని ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోతో అందరికీ అర్థమైంది. అయితే దీనికి సంబంధించిన వీడియో రష్మిక స్వ‌యంగా రిలీజ్ చేసింది.

ఇప్పుడు ఆ సాంగ్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. పుష్పా 2 నుంచి.. త్వరలో రాబోతున్న ఈ సెకండ్ సింగిల్‌కు.. శ్రేయ ఘోషల్ గానం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ మొత్తం ఆరు భాషల్లో శ్రేయ ఘోషల్‌ ఆలపించారు. ఇలా ఒకే పాటను ఐదుకు పైగా భాషల్లో పాడిన వ్యక్తుల్లో బాలసుబ్రమణ్యం, శంకర్ మహదేవన్ తరువాత శ్రేయ ఘోషల్ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఏ ఫిమేల్ సింగర్ కూడా ఈ అవకాశాన్ని అందుకోలేదు.

Pushpa 2' second single 'Angaaron' promo released - TheDailyGuardian

మొదటిసారి శ్రేయ ఘోషల్ ఒకే పాటను ఆరు భాషల్లో ఆలపించి రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఈ పాటను ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడి రికార్డ్ సృష్టించింది. 29వ తేదీన 11 గంటలకు ఈ పాటను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.